calender_icon.png 7 November, 2024 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సరఫరాలో అంతరాయం

07-11-2024 12:24:07 AM

అబ్కారీ శాఖలో సాఫ్ట్‌వేర్ సమస్య

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా అన్ని మద్యం డిపోలలో లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. వైన్‌షాప్‌లకు మద్యం సరఫరా చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలే ఇందుకు కారణం. ఫలితంగా సర్వర్ స్తంభించి రాష్ట్రం మొత్తం లిక్కర్ సరఫరాకు బ్రేకులు పడ్డాయి.

దీంతో డీడీలు కట్టి డిపోలకు వెళ్లిన డీలర్లకు సర్వర్ హ్యాంగ్ అయిందన్న సమాచారంతో మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. చాలాకాలంగా రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారానే జరుగుతోంది. డీలర్లకు వేగంగా లిక్కర్ సరఫరాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఎంత సరుకు ఉంది, డీలర్లు ఎంత తీసుకెళ్లారో స్పష్టంగా తెలిసేందుకు అధికారులు ఆన్‌లైన్ విధానం తీసుకొచ్చారు.

పూర్తి పారదర్శకంగా ఉన్న ఈ పద్ధతి అటు అధికారులకు, ఇటు డీలర్లకు ఉపయోగంగా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో సర్వర్ హ్యాంగ్ కావడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సమస్యను వేగంగా పరిష్కరించాలని అబ్కారీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.