13-04-2025 01:02:51 AM
* నిలిచిపోయిన సేవలు
* స్పందించిన ఎన్‌పీసీఐ... సేవల పునరుద్ధరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: యూనిఫైడ్ పేమెం ట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలకు శనివా రం దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. యూపీఐతో పని చేసే అన్ని యాప్స్ మొరాయించాయి. ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం, భీమ్ యూపీఐ వంటి యాప్స్‌లో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది.
డౌన్ డిటెక్టర్ ప్రకారం శనివారం ఉదయం 11:26 నుంచే యూపీఐ లావాదేవీల్లో సమస్యలు తలెత్తుతున్నాయని యూజర్లు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. 11:40 వరకు 222 మంది తమ డిజిటల్ లాలాదేవీలు విఫలం అయినట్లు రిపోర్ట్ చేశారు. ఈ సమస్యలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పందించింది.
‘ఎన్‌పీసీఐ ప్రస్తుతం సాంకేతిక సమస్యలను ఎదు ర్కొంటోంది. అందువల్లే కొన్ని యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తు న్నాం.’ అని ఎన్‌పీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తర్వాత కొద్ది సేపటికి యూపీఐ సేవలు యధావిధిగా పని చేశాయి. ఏప్రిల్ 2న కూడా యూపీఐ సేవలు కొంత సేపు నిలిచిపోయాయి.
అంతకు ముందు మార్చి 26న కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మార్చి 31న కూడా చెల్లింపుల్లో ఆలస్యం కాగా.. ఎన్‌పీసీఐ ఆర్థిక సంవత్సరం ముగింపు సంద ర్భంగా బ్యాంకుల దగ్గరే ఆలస్యం అవుతోందని క్లారిటీ ఇచ్చింది. ఈ నెలలో ఇలా జరగ డం ఇది రెండో సారి.