విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఘట్కేసర్, నవంబర్ 9: ఓ వివాహ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో పదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఇన్స్పెక్టర్ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ యానంపేట్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివాసం ఉంటున్న మీసాల నర్సింహ పోచారం మున్సిపాలిటీలో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 7న నర్సింహ పెద్దనాన్న కొడుకు మీసాల శ్రీశైలం వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి ఈడబ్ల్యూఎస్ కాలనీలో విందు ఏర్పాటు చేశారు. విందు సందర్భంగా వేదిక చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలలో నర్సింహ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న నర్సింహ కుమారుడు కేతన్రాం(10)కు లైట్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తాకటంతో షార్టు సర్క్యూట్‌తో కిందపడి పోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. లైట్ల ఏర్పాటులో తీసుకోకపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయినట్లు పోలీసులు తెలిపారు. నర్సి ంహ ఫిర్యాదుతో లైట్లు ఏర్పాటు చేసి న వినోద్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.