calender_icon.png 20 September, 2024 | 8:18 AM

గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి

19-09-2024 01:27:52 AM

కాగజ్‌నగర్‌లో క్రేన్ ఢీకొని మున్సిపల్ కార్మికుడి మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గణపతి నిమజ్జనోత్సవం అపశృతి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పెద్దవాగు వద్ద మంగళ వారం రాత్రి నిమజ్జనోత్సవం నిర్వహి స్తున్నారు. విధుల్లో పాల్గొన్న మున్సిపల్ కార్మికులు నగేశ్, ప్రేమ్ మీదకు క్రేన్ దూసు కెళ్లింది. వీరికి తీవ్రగాయాలు కావడంతో హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందు తూ నగేశ్ మృతిచెందాడు. కార్మికుడి మృతి పట్ల ఎమ్మెల్యే హరీశ్‌బాబు విచారం వ్యక్తం చేశారు. 

శోభాయాత్రలో ఉద్రికత్త

కామారెడ్డి, సెప్టెంబర్‌౧౮ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మంగళవారంరాత్రి నిర్వహించిన గణేశ్ శోభయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పాంచ్ చౌరస్తా వద్ద  నిమజ్జనం ఆలస్యమవుతోందని పోలీసులు బ్యాండ్‌ను పక్కకు తప్పించి విగ్రహాలను ముందుకు వెళ్లాలని సూచించడం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీసులు తమపై లాఠిచార్జి చేశారంటూ యువజనసంఘాలుఆరోపించాయి. తాము చెదరగొట్టే ప్రయత్నంలో సంఘాల నాయకులు పరుగులు తీస్తూ కింద పడ్డారని పోలీసులు చెప్తున్నారు. విశ్వహిందు పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున ౩ గంటల వరకు నిరసన కొనసాగింది. 

గుండెపోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి 

నిజామాబాద్,సెప్టెంబర్‌౧౮(విజయక్రాంతి): వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ వ్యక్తి డీజే శబ్దానికి గుండెపోటుతో చనిపోయిన ఘటన మాక్లూరు మండల ముత్యంపే ట్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మధు(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. మంగళవారం రాత్రి మానిక్ భండార్ గ్రామానికి చెందిన వినాయక విగ్రహం నిమజ్జనానికి వెళ్లాడు. ఈ సందర్భంగా డీజే పెట్టడంతో ఆ శబ్దానికి మధుకు గుండె పోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు.