calender_icon.png 15 January, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపేక్షించలేదు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

08-08-2024 02:49:12 AM

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): జనగామ డిపోకు చెందిన కండక్టర్ శంకర్‌పై అకారణంగా విధుల నుంచి తప్పించారనే ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ నెల 1న ఒక మహిళ, తన తల్లి, ఏడాది కుమారుడితో కలిసి హైదరాబాద్ బస్సు ఎక్కింది. వారు తమ సీట్లను ఖాళీ చేయాలంటూ కండక్టర్ శంకర్ వారితో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించాడన్నారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నదని మహిళ చెప్పినా వినకుండా ముగ్గురినీ కండక్టర్ మడికొండ వద్ద బస్సులోంచి దింపేశాడన్నారు. ఘటనపై యాజమాన్యం విచారణ జరిపించి.. కండక్టర్ బస్సు నుంచి ప్రయాణికులను దింపేశాడని నిర్ధారించామని స్పష్టం చేశారు. సదరు కండక్టర్‌పై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని, ఆయనపై 12 ఫిర్యాదులు అందాయని, అయినా సంస్థ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చామని, ఈసారి మాత్రం ఉపేక్షించలేదన్నారు.