05-03-2025 09:03:48 PM
అక్రమమని తెలిసినా హద్దులను తొలగించడంలో జాప్యం ఎందుకు..?
ముడుపులు ముట్టాయని ఆరోపిస్తున్న స్థానికులు..?
జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయని స్థానిక అధికారులు..
అక్రమాలపై చర్యలేవి..
కామారెడ్డి (విజయక్రాంతి): అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన స్థానిక అధికారులు భేఖాతార్ చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లు అనధికార భవనాలు నిర్మిస్తున్న తీరుపై స్థానిక గ్రామస్తులు ఫిర్యాదులు చేయగా విచారణకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ లో అక్రమంగా పాతిన హద్దురాలను తొలగించాలని, అక్రమ బిల్డింగ్ ల నిర్మాణాన్ని ఆపాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసిన గాంధారి మండల ఎంపీఓ గాంధారి గ్రామ కార్యదర్శి ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇతరులకు చెందిన స్థలంలో రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడమే కాకుండా హద్దురాల్లోను పాతడంపై జిల్లా పంచాయతీ అధికారికి, జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ)లకు ఆర్టిఐ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని ఈ అధికారులకు గ్రామస్తులు బాధితులు ఫిర్యాదు రూపంలో అందించగా స్పందించిన జిల్లా స్థాయి అధికారులు వెంటనే హద్దురాళ్ళను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ భవన నిర్మాణాన్ని ఆపివేయాలని మండల, గ్రామ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఉన్నత అధికారుల ఆదేశాలు అమలు చేయడంలో జాప్యం వహిస్తున్నారు. సమాజంపై అవగాహన ఉన్న ఒక వ్యక్తి ప్రజలు అక్కడ వెలసిన వెంచర్లో ప్లాట్లు కొని ఆ తర్వాత భవనాల నిర్మించుకున్న అనంతరం వచ్చే ఇబ్బందులను ఇప్పుడే గుర్తించి సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించి ఆ వెంచర్ను ఆ వెంచర్లో వేసిన హద్దురాళ్ళను తొలగించాలని కోరుతూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు గత పది రోజుల క్రితమే గాంధారి ఎంపిఓకు, గాంధారి గ్రామ కార్యదర్శికి నోటీసుల రూపంలో ఆదేశాలు జారీ చేశారు. అక్కడ వేసిన హద్దురాళ్ళను తొలగించి, అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లో క్రయవిక్రయాలు జరగకుండా బోర్డులను ఏర్పాటు చేయాలని, అట్లాగే అక్రమ మూగ నిర్మిస్తున్న భవనంపై చర్యలు తీసుకోవాలని ఖచ్చితమైన ఆదేశాలను ఉన్నతాధికారులు జారీ చేశారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై అధికారులకు ఎందుకు అంత ప్రేమ వ్యక్తం చేస్తున్నారు అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలి
జిల్లాస్థాయి అధికారులు సైతం అక్రమ వెంచరు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గ్రామస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మండల, గ్రామస్థాయి అధికారులు మాత్రం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకోకుండా అతనిపై ప్రేమ చూపడంపై గాంధారి మండల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వెంచర్లో అధికారులకు వాటా ఉందా అనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రియల్ ఎస్టేట్స్ వ్యాపారి వేసిన వెంచర్ల లో సైతం ప్రభుత్వ భూమి కలుపుకొని ఉందనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లల పై అధికారులకు తెలిసిన ఆ వెంచర్లపై సర్వే కాని అటువైపు కన్నెత్తి చూసిన పాపన అధికారులు పోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటి అన్నిటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చాం... అదనపు రెవిన్యూ కలెక్టర్ విక్టర్
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసి అమ్మ డం జరిగిందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించినట్లు జిల్లా అదరపు కలెక్టర్ రెవిన్యూ విక్టర్ విజయ క్రాంతి ప్రతినిధి తో తెలిపారు.