హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాస్థాయిలో గత నెల 28 నుంచి 30వ తేదీల్లో నిర్వహించిన సైన్స్‌ఫెయిర్‌లో దామెర మం డలం ఒగులాపూర్‌లోని డిస్నీ ల్యాండ్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ‘ఓపెన్ వెల్ ఆర్గానిక్ ఫాం’ అనే అం శంపై మాలోత్ నితిన్‌నాయక్ ప్రదర్శించిన ఎగ్జిబిట్ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది.
అలాగే జిల్లాస్థాయిలో తోట శివకేశవ ‘ఈజీ లోడ్ క్యారియర్ ఫర్ లేబర్’ అనే అంశంపై ప్రదర్శించిన ఎగ్జిబిట్ మూడో స్థానం, గట్టు అనన్యారెడ్డి ‘ట్యూన్ మాస్ డంపింగ్ టెక్నాలజీ’ అంశంపై ప్రదర్శించిన ఎగ్జిబిట్ మూ డోస్థానంలో నిలిచింది. విద్యార్థులను పాఠశాల ముఖ్యసలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, కరస్పాండెంట్ బాలుగు శోభారాణి, డైరెక్టర్లు దయ్యాల రాకేశ్, భానుశ్రీ, దినేష్ చందర్ అభినందించారు.