calender_icon.png 21 February, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

20-02-2025 11:30:27 AM

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) హైకోర్టును ఆశ్రయించగా, వాదనలు విన్న కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దళిత యువకుడు సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో గతంలో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలు(Vijayawada district jail)లో ఉన్నాడు.