12-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): 2021లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించా రం టూ హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి ఎం పీ ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టి ప్ర తివాదులకు నోటీసులు జారీ చేశారు.
తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, డీ ఫ్యాక్టో ఫిర్యాదుదారు, అప్పటి కరీంనగర్ జి ల్లా ఎల్కతుర్తి తహసీల్దార్ ఎన్ విజయ్‌కు నో టీసులు జారీ చేశారు.
ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి ఉప్పల్ గ్రామంలో బీజేపీ కార్యకర్త తోట సురేశ్ ఇంటికి ఈటల వెళ్లడంపై కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో విచారణలో ఉంది.