‘సీతారామం’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ అవకాశాలు అందుకుంటోందీ భామ. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘పూజా మేరీ జాన్’ విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. “పూజా మేరీ జాన్’ షూటింగ్ రెండేళ్ల క్రితమే అయిపోయింది. బహుశా ఈ ఏడాదే రిలీజ్ కావొచ్చు. ఇందులో పాత్ర నాకు బాగా నచ్చింది. అలాంటి పాత్ర రోల్ చేయాలని ఎప్పుట్నుంచో అనుకుంటున్నా.
ఎందుకంటే ఆ క్యారెక్టర్ నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆ పాత్ర కోసం చాలా ఆడిషన్స్ ఇచ్చాను. స్క్రీన్ టెస్టుల్లో పాల్గొన్నాను. అయితే, మరొక నటిని తీసుకోవాలని చూస్తున్నారని తెలిసి ప్రొడ్యూసర్స్‌తో ఫైట్ చేశాను.. ఇంకా చెప్పాలంటే వాళ్లను అడుక్కున్నాను” అని చెప్పిందీ మరాఠీ ముద్దుగుమ్మ. ఇంకా ఈ అమ్మడు ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలోనూ మృణాలే హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలతో పోరాటం చేసి మరి డ్రీమ్ రోల్‌లో నటించిన మృణాల్ ఆ పాత్రతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.