- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, జూన్28 (విజయక్రాంతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతిసామితో చర్చించినట్లు ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. కర్నాటకలోని శృంగేరీ శారదాపీఠంలోని శారదా మాత అమ్మవారిని శుక్రవారం ఆది శ్రీనివాస్ కు టుంబ సమేతంగా దరించుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధిపై శేఖర భారతిస్వామి సలహాలు, సూచనలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
1.11 కోట్లతో గోశాల ఆధునీకరణ
శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలను రూ.1.11కోట్లతో ఆధునీకరించనున్నట్లు ఆలయ ఈవో రామకృష్ణ ప్రక టనలో తెలిపారు. గోశాలలో రూ.18లక్షలతో డ్రైనేజీ, రూ.43 లక్షలతో ఫ్లోరింగ్, రూ. 50 లక్షలతో 2 షెడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.