calender_icon.png 30 October, 2024 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' బిల్లును ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు

01-08-2024 10:47:22 AM

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగున్నాయి. 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' బిల్లును అసెంబ్లీలో గురువారం మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా.. మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వపరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్యాడ్యుయేట్లలో కొరవడ్డాయని తెలిపారు. నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామన్నారు. నైపుణ్యాల పెంపొందించే ఉద్యేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ స్థాపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపొనెంట్ ను కలిగి ఉంటాయన్నారు. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు మంత్రి సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతోందన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుందన్నారు.