calender_icon.png 1 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరలో వసంత పంచమి ఏర్పాట్లపై చర్చ

28-01-2025 06:20:43 PM

వేడుకలకు రావాలని మంత్రికి ఆహ్వానం...

భైంసా (విజయక్రాంతి): జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కతో హైదరాబాదులో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కలిశారు. బాసరలో వసంత పంచమి ఏర్పాట్లపై చర్చించారు. తక్షణమే రెగ్యులర్ ఈవో ను నియమించాలని కోరారు. గతం కంటే పెద్ద మొత్తంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వసంత పంచమికి రావాలని మంత్రిని ఆహ్వానించారు. అదేవిధంగా ప్రభుత్వం బాసర ఆలయ పునర్నిర్మాణానికి వెచ్చించిన 42 కోట్ల నిధులకు సంబంధించిన పనులను ప్రారంభించాలన్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే పటేల్ సమావేశమై మంత్రితో చర్చించారు.