- 10న మేధావుల సమావేశానికి తరలిరండి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): రాష్ర్టంలో సమగ్ర కులగణన నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాలపై ఈనెల 10న బీసీ మేధావుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తు న్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలనే డిమాండ్‌తో తాము చేసిన పోరాటానికి రాష్ర్ట ప్రభుత్వం స్పందిం చి సమగ్ర కులగణన చేపట్టిందన్నారు. కుల గణన తర్వాత ప్రభుత్వ కార్యాచరణ నెమ్మదించిందని, దానికి సంబంధించిన స్పష్టమై న ప్రకటన చేయడం లేదని ఆరోపించారు.
దీంతో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతారా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. బీసీ రిజర్వేషన్ల ను పెంచడానికి రాష్ర్ట ప్రభుత్వం వెంటనే న్యా య నిపుణులు, సామాజికవేత్తలు, మేథావు లు, బీసీ సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు.
బీసీల భవిష్యత్ కార్యాచరణ చర్చించడానికి మేథావుల సమావేశం ఏర్పాటు చేస్తున్న ట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, సామాజికవేత్తలు, ప్రొఫెస ర్లు, రాజకీయపార్టీల నాయకులు, అన్ని బీసీ సంఘాలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు.