భూమి హక్కులు,సంస్కరణలపై చర్చ
భూదాన ఉద్యమం ఇక్కడే పుట్టింది
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. సభలో భూమి హక్కులు, సంస్కరణలపై చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... భూసంస్కరణలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీకారం చుట్టారని చెప్పారు. భూసంస్కరణలతో అనేక విషయాలు అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నర్సింహరావు కూడా భూసంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రపంచ చరిత్రలో నిలిచిన భూదాన ఉద్యమం ఇక్కడే పుట్టిందని మంత్రి వెల్లడించారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చి.. పేదలకు భూములు పంచిందని తెలిపారు. వైఎస్ హయాంలో పోడుభూములకు పట్టాలు ఇచ్చారని పొంగులేటి తెలిపారు. ప్రజలకు మంచి చేసిన వారి పేర్లు ప్రస్తావించడం సుముచితం అన్నారు. భూ సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తెస్తామని అనేక మంత్రి చెప్పారన్నారు. ఇవాళ ఎక్కడ చూసిన భూ సమస్యలే కనిపిస్తున్నాయి.