calender_icon.png 20 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి జిల్లా సమస్యలపై చర్చించండి

13-12-2024 12:33:31 AM

* కేటీఆర్‌కు జోగు రామన్న వినతి

ఆదిలాబాద్, డిసెంబర్ 1౨ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ను మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. హైదరాబాద్‌లో గురువారం కేటీఆర్‌ను రామన్న సమక్షంలో ఉమ్మడి జిల్లా నేతలు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా సమస్యలపై చర్చించి, ప్రభుతంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉందని, కార్యకర్తలు ప్రభుత విధానాలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాల వారీగా నిరహించే సమావేశాలకు కేటిఆర్ హాజరవుతానని చెప్పినట్టు జోగు రామన్న పేర్కొన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మాజీ డీసీసీబీ చైర్మన్ కిషన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి చారులత, నాయకులు జాన్సన్ భుక్య నాయక్ తదితరులు ఉన్నారు.