calender_icon.png 7 January, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీలపై వివక్ష తగదు

03-01-2025 01:28:59 AM

* తుడుం దెబ్బ రాష్ట్ర కోకనీనర్ గోడం గణేశ్

ఆదిలాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ఆదివాసీలుగా పుట్టడమే మేము చేసిన నేరమా అంటూ తుడుం దెబ్బ రాష్ట్ర కోకనీనర్ గోడం గణేశ్ ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ కరెంట్ ఉన్నా, ఆదివాసులు నివసించే కొమ్రంభీం కాలనీలో మాత్రం కరెంట్ ఉండదని, మాకెందుకు ఈ శిక్ష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కొమ్రంభీం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), కొమ్రంభీం కాలనీ నిరహణ కమిటీ ఆధర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. ముందుగా కొమ్రంభీం కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ పాదయాత్ర నిరహించారు.

కర్రలకు చెడి పోయిన విద్యుత్ తీగలు, బల్బులు కట్టి వాటిని చేతపట్టుకొని కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట బైటాయించి నిరసన చేపట్టారు. దీంతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు వినతిపత్రం అందజేశారు. 

సందర్భంగా తుడుం దెబ్బ రాష్ర్ట కోకనీనర్ గోడం గణేశ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కొమ్రం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు గృహ జ్యోతి పథకం దారా వెంటనే కరెంట్ సౌకర్యం కల్పించి, మంచినీళ్లు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదరి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక పాల్గొన్నారు.