calender_icon.png 19 October, 2024 | 1:55 PM

రాష్ట్రబడ్జెట్‌లో ‘జనగాం’పై వివక్ష

28-07-2024 03:22:40 AM

బచ్చన్నపేట, జూలై 27: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జనగామ జిల్లాపై వివక్ష చూపిందని బీజేపీ జిల్లా నేత బేజాడీ బీరప్ప అన్నారు. బచ్చన్నపేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగా మకు ఇండస్ట్రీయల్  కారిడార్ వ స్తుందని జిల్లా ప్రజలు ఆశించారని, వారి ఆశలపై సర్కార్ నీళ్లు చల్లిందన్నారు. జనగామలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆధిపత్య పోరు మధ్య ఈ ప్రాం త ప్రజలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. సమావేశంలో పార్టీ నాయ కులు చిమ్ముల నరేందర్, నాగేశ్, సోమిరెడ్డి, సాయి పాల్గొన్నారు