calender_icon.png 13 February, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ

12-02-2025 10:12:14 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. సోమయాజుల సాయి శర్మ సిద్ధాంతి  గునింపబడిన విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ ఆలయ ఈవో శ్రీ పార్నంది విశ్వనాథ శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి మాట్లాడుతూ... పిన్న వయస్సులో సిద్ధాంతాన్ని అభ్యసించి మానవాళికి దినచర్యలో ప్రతిరోజు ఉపయోగపడే పంచాంగాన్ని సిద్ధం చేయడం సాక్షాత్తు లక్ష్మీ నృసింహ స్వామి వారి అనుగ్రహం అని సాయి శర్మ ప్రతి సంవత్సరం పంచాంగాన్ని తయారుచేసి మానవాళికి ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.