calender_icon.png 28 February, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ

28-02-2025 07:34:46 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): జాతీయ సైన్స్ దినోత్సవంను పురస్కరించుకొని శుక్రవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల కళాశాల ఎదురుగా పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగ ప్రశాంత్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫీలసాఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రేైనర్ బాల బోయిన సుదర్శన్, విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. శాస్త్రీయ విద్యా విధానం, ప్రస్తుత పరిస్థితుల్లో సైన్స్ ఎదుర్కొంటున్న సవాళ్లు, మూఢవిశ్వాసాలతో ప్రజలు నష్టపోతున్న పరిస్థితులపై అవగాహన కల్పించారు.

ఈ దేశానికి పూలే మహాత్మ, సావిత్రిబాయి పూలే, పెరియార్, అంబేద్కర్ చేసిన సేవలు గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా వివిధ ప్రభుత్వ కళాశాలలకు, గురుకులాలకు, జూనియర్ కళాశాలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రజలలో, విద్యార్థుల్లో సైన్స్ భావనలు పెంపొందించిన సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, అంబేద్కర్ వల్లనే ఈ దేశ ప్రజలకు విద్య, వివేకం, విజ్ఞానం అందిందని అన్నారు. 

హైకోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చదువు పట్ల ఆకర్షితులు కావడానికి కృషి చేసిన పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక, మహనీయుల విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలోబీసీ మహిళ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఎర్ర సువర్ణ, కవి రచయిత తోట భూమన్న, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు తోకల రాజేశం, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్, సిఓఈ బాలుర ప్రిన్సిపల్ శ్రీధర్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సరిత, విజయలక్ష్మి, విగ్రహ ప్రతిష్ట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గుడిసెల శ్రీహరి, డిఆర్ శ్రీధర్, కమిటీ సభ్యులు జిఏ జ్యోతి కుమార్, ఎలుపుల కనకయ్య, అక్కు ఉమ కృష్ణ, దుబాసి రవి, గుడిసెల చంద్రమౌళి, ఎల్తూరి శంకర్, జంజర్ల రవిరాజ్, కృష్ణపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.