calender_icon.png 10 October, 2024 | 5:48 AM

స్క్రాపేజ్ సర్టిఫికెట్‌తో కొత్త వాహనాలకు డిస్కౌంట్లు

28-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 27: పాత వాహనాల్ని తుక్కుగా మార్చినట్టు స్క్రాపేజ్ సర్టిఫికెట్ చూపిస్తే కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ శాఖ మంత్రి నితి న్ గడ్కరీతో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మా న్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) ప్రతినిధి బృందం సమావేశమయ్యింది.

చర్చల సందర్భంగా మంత్రి వాహనాల ఆధునీకరణ పట్ల చేసిన సూచనలకు పలు వాణి జ్యవాహన ఉత్పత్తిదారులు, పాసింజర్ వా హన ఉత్పత్తిదారులు కొత్త వాహనాల కొనుగోలుపై పరిమితకాలం స్క్రాపేజ్ సర్టిఫికెట్ డిపాజిట్‌తో డిస్కౌంట్లు ఇచ్చేందుకు అంగీకరించారని ప్రకటన పేర్కొంది. పాసింజర్ వా హన కంపెనీలు ఒక ఏడాది, వాణిజ్య వాహ న కంపెనీలు రెండేండ్లపాటు తగ్గింపు ధరలతో విక్రయించడానికి ముందుకు వచ్చార ని మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది.