calender_icon.png 4 March, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ

04-03-2025 08:05:17 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్-2020 లో దరఖాస్తు చేసుకున్న (ఇంటి స్థలం కోసం) వారికి రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇస్తోందని బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్త్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్-28 ద్వారా ఈ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. దీనికి మార్చి 31 చివరి గడువు కాబట్టి ఈ అవకాశాన్ని బూర్గంపాడు మండలంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.