06-03-2025 11:25:32 PM
సౌత్ కొరియాలో సొంత పౌరులపై వైమానిక దాడులు..
సియోల్: సౌత్‌కొరియా వాయుసేన చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకున్నది. పోచెయోన్ స్థావరం నుంచి ఎంకే శ్రేణి బాంబులతో బయల్దేరిన సియోల్ ఫైటర్ జెట్ కేఎఫ్ నుంచి బాంబులు మిస్ ఫైర్ అయ్యాయి. వాస్తవానికి బాంబులను ఆ దేశ సరిహద్దుకు 25 కి.మీ దూరంలో జారవిడవాలి. కానీ.. అవి కాస్త సొంత పౌరుల జనావాసాలపై పడ్డాయి. బాంబుల దాడిలో నలుగురు తీవ్ర గాయాల పాలవ్వగా, ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై అక్కడి వాయుసేన ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఘటన తమను కలచివేసిందని, పౌరులకు క్షమాపణలు చెప్తున్నామని వెల్లడించారు. ప్రమాదంపై యాక్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ విచారణ జరిపి, అనంతరం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.