calender_icon.png 15 January, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

08-08-2024 12:41:30 AM

48 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు 

మహబూబ్‌నగర్ జిల్లా నాగసాల మైనార్టీ గురుకులంలో ఘటన

జడ్చర్ల : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గంలోని నాగసాలలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వ స్థతకు గురయ్యారు. ఉద యం కిచిడీతో అల్పాహారం చేసిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. విద్యార్థులకు కడుపునొప్పితోపాటు వాంతులు రావడంతో వైద్య అధికారులకు గురుకుల సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే పాఠశాలకు చేరుకున్న వైద్యులు చికిత్స అందించారు. 48 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా 9 మంది విద్యార్థులకు కడుపునొప్పి తీవ్రంగా ఉండటంతో వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెంటనే గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. భోజనంతోపాటు వంటకాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు జరిగి పూర్తిస్థాయి వివరాలను తెలియజేస్తామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పా రు. మరోవైపు పాఠశాలకు ప్రహరీ  లేకపోవడంతోపాటు ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు.

విద్యార్థులకు అందించే భోజనాన్ని రోజూ తనిఖీ చేయాలని స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించినట్టు తెలిపారు. వంట పాత్రలతోపాటు ప్రతి విషయంలోనూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టంచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలతోపాటు వసతి గృహాల నిర్వహణపై నిఘా ఉంచుతామన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా యో పూర్తిస్థాయిలో గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 

ఆందోళనలో తల్లిదండ్రులు 

గురుకుల పాఠశాలల్లో మంచి భోజన సదుపాయాలతోపాటు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తామని చెబితేనే మా బిడ్డలను చేర్పించామని, కలుషిత ఆహారం పెట్టి వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల నుంచి గురుకులాల్లో విద్యార్థులకు భోజనం సరిగ్గా ఉండ టం లేదని వాపోయారు. పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉందని, అందువల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతుందన్నాయని, ఇప్పటికైనా హాస్టళ్లపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.