calender_icon.png 9 January, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణతో కూడిన అధ్యయనం అవసరం

09-01-2025 12:04:40 AM

ఓయూలో ఉచిత సివిల్స్ కోచింగ్ ప్రారంభంలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే శ్రద్ధ, క్రమశిక్షణతో కూడిన అధ్యయనం చాలా అవ సరమని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, సివిల్ సర్వీసెస్ శిక్షణ నిపుణురాలు ఎం బాలలత, రిటైర్డ్ ప్రొఫెసర్ చింత గణేశ్ తదితర వక్తలు పేర్కొన్నారు. ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం ఓయూలో ఉచిత శిక్షణా కార్యక్రమా న్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ కష్ట, నష్టాలను దాటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభ్యర్థులు, విద్యార్థులకు సూచించారు. బాలలత మాట్లాడుతూ కఠినమైన అంశాలను కూడా సులభతరంగా అర్థం చేసుకొనే స్మార్ట్ వర్క్‌తో కూడిన అధ్యయనం అవసరమన్నారు. సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఉద్యమాల నిలయమైన ఓయూ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి దేశానికి తలమానికంగా నిలవాలన్నారు.