calender_icon.png 19 April, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

--------క్రమశిక్షణే బీజేపీ పునాది

11-04-2025 12:00:00 AM

స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు

ఖమ్మం ,  ఏప్రిల్ 10 ( విజయక్రాంతి ):-బీజేపీ కార్యకర్తలు కేవలం ఓటు గెలిపించే యంత్రాలు మాత్రమే కాదు, వారు దేశభక్తి, నిస్వార్థ సేవా భావన, క్రమశిక్షణకు ప్రతీకలు. ఈ నైతిక విలువలపై పార్టీ ఎదుగుదల ఆధారపడి ఉంటుందనీ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు.

గురువారం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండల కేం ద్రంలో బీజేపీ క్రియాశీలక సభ్యుల సదస్సు మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మా రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని పెంపొందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

బీజేపీ అంటే క్రమశిక్షణకు ప్రతీక. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ నైతికతను పునర్వ్యాఖ్యానించాలంటే క్రమశిక్షణను పాటించాల్సిందే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థాయిలో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టి విజయాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉండాలి, అని పేర్కొన్నారు.పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘గాం చలో - బస్తీ చలో’ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు ప్రజల మధ్యకి వెళ్లి బీజేపీ భావజాలాన్ని విస్తరించాలని అన్నారు.

గ్రామ స్థాయిలో బీజేపీ బలపడితేనే రాష్ట్ర స్థాయిలో విజయం సాధ్యమవుతుందని, గ్రామ కమిటీలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన తొమ్మిది అంశాలను ప్రతి కార్యకర్త తధ్రమైన పద్ధతిలో అమలు చేయాలి. ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీ ఆధ్వర్యంలో పరిష్కార మార్గాలు సూచించాలి, అంటూ ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో  ఖమ్మం పార్లమెంటు కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ , జిల్లా నేతలు భూక్య శ్యామ్ సుందర్ నాయక్, మండపు సుబ్బారావు, రవీంద్రర్, మండల స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.