14-04-2025 08:07:23 PM
వనవాసీలో ఘణంగా ఆర్ కే జన్మదిన వేడుకలు..
చర్ల (విజయక్రాంతి): ప్రతి విద్యార్దికి విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు అన్నారు. చర్లకు చెందిన ఆర్ కే పెస్టిసైడ్స్ & సీడ్స్ యజమాని దేవభక్తుని రామకృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన సన్నిహితులు మాచవరపు బాలు, బండారు భరణి, కజ్జం బాస్కర్, మాగంటి నాగేంద్ర, కోరం ముత్యాలరావు లు వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయం కు 50 కేజీల బియ్యం, భోజన ఏర్పాట్లు చేసి స్వీట్స్, పండ్లను అందచేసారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శోభన్‌బాబు విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగించారు. విద్యార్దులు ఉత్తమ విద్యార్థి ప్రధమ లక్షణం క్రమ శిక్షణ అని గొప్ప చదువులు చదివి ఉన్నత స్దితికి చేరాలని తద్వారా దాతలు అందించిన వితరణలకు సార్దకత చేకూరుతుందని అన్నారు. దేశం ఆహార కొరత లేదని కేవలం విద్యా కొరతే ఉన్నదని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ పేద విద్యార్దులు విద్యనభ్యసించి ఉన్నత స్దితికి చేరుకోవడంలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక పేద విద్యార్ది చదివి జీవితంలో స్దిర పడితే ఆ కుటుంభంలోని భావితరాలు వృద్దిలోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండి పేద విద్యార్దుల విద్యాభివృద్దిలో బాగస్వాములు కావాలని కోరారు. ఆర్ కే సీడ్స్ యజమాని రామకృష్ణ తమ తండ్రి జ్ఞాపకార్థం గత ఏడాది వనవాసీ విద్యార్దులకు కూలర్లను అందించిన విషయం గుర్తుచేసారు. ఇప్పుడు ఆయన సన్నిహితులు బియ్యం, భోజన ఏర్పాట్లు చేయడం అబినందనీయమన్నారు. వనవాసీ కమిటి తరపున దాతలకు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో వనవాసీ చర్ల ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, నిలయ కమిటీ ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు.