calender_icon.png 21 January, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతోనే క్రమశిక్షణ, ఆరోగ్యం

05-07-2024 12:24:12 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్, జూలై 4 (విజయక్రాంతి): క్రీడలు క్రమశిక్షణ నేర్పడంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలోని ఇం డోర్ స్టేడియంలో జరిగిన 10వ అండర్ తెలంగాణ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2024 పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉన్నదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ ఉన్నారు.