- ఐక్యంగా పనిచేస్తేనే సంస్థకు పురోగతి
- ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ చెవ్యూరు హరికిరణ్
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖలో కింది స్థాయిలో ఉద్యోగులు క్రమశిక్షణతో పని చేయాలంటే జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ, పరిశీలన ఎంతో అవసరమని తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ చెవ్యూరు హరికిరణ్ సూచించారు.
నూతన సంవత్సరం సందర్భంగా సంబంధిత శాఖకు చెందిన ఉమ్మడి పది జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, గెజిటేడ్ ఆఫీసర్స్ అసోషియే న్ అధికారులు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, సెంట్రల్ ఫోరం ఉద్యోగులు ఎక్సైజ్ డైరెక్టర్ హరికిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.. అధి కారుల పర్యవేక్షణతో పాటు కార్మిక సంఘాలు కూడా ఐక్యంగా పని చేస్తేనే శాఖలో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు.
డైరెక్టర్‌ను కలిసిన వారిలో ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్, గౌరవ అధ్యక్షుడు ఖురేషి, కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జి. శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ చంద్రయ్య, కరనమ్ చంద్, రఘురామ్, గణేశ్, జీవకిరణ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ఎక్సైజ్ శాఖ టీఎన్‌జీవో ఎస్‌వో తిరుపతి, అనిల్, రమేశ్, మోజెస్, రాజశేఖర్ , క్రాంతి ఉన్నారు..
క్రైమ్ కంట్రోల్‌పై దృష్టి పెట్టండి : కమలాసన్‌రెడ్డి
ఎక్సైజ్ శాఖ విధులతో పాటు క్రైమ్ కంట్రోల్‌పై కూడా దృష్టి పెట్టాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి సూచించారు. సంబంధిత శాఖకు చెందిన అధికారులు కమలాసన్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.