calender_icon.png 23 December, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీపీ విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు

23-12-2024 02:25:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏసీపీ విష్ణుమూర్తి(సస్పెండెడ్)పై క్రమశిక్షణ చర్యలు చేపడతామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంష్ యాదవ్ తెలిపారు. విష్ణుమూర్తి గతంలో నిజామాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత అతడిపై వచ్చిన కొన్ని ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్‌లో అతడిని సస్పెండ్ చేసి, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ విషయమై డీజీపీకి నివేదికను పంపుతున్నట్లు వివరించారు.