కోదాడ (విజయక్రాంతి): ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక చొరవతో ఇందిర మహిళా శక్తి పథకం కింద 35 సంఘాలకు మంజూరైన రూ.2.85 కోట్ల విలువైన రుణాల చెక్కును మునిసిపల్ చైర్మన్ సామినేని ప్రమీల చేతుల మీదుగా బుధవారం సంఘ బంధాలకు అందజేశారు. వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కమిషనర్ రమాదేవి, వార్డు కౌన్సిలర్లు గంధం యాదగిరి, షాబుద్దీన్, కర్రి శివ, తిప్పిరి శెట్టి సుశీల, ఖదీర్, సంఘ బంధాల సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.