calender_icon.png 26 October, 2024 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద అంబర్‌పేట్‌లో నెగ్గిన అవిశ్వాసం

14-09-2024 01:04:02 AM

  1. తీర్మానానికి మద్దతు తెలిపిన 17మంది కౌన్సిలర్లు 
  2. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి నుంచి స్వప్న ఔట్ 
  3. పండుగల జయశ్రీను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్న సభ్యులు

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 13 : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్నపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమెపై సొంత పార్టీ కౌన్సిలర్ల్లే అవిశ్వాస తీర్మానం పెట్టిన విష యం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గం టలకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి సమక్షంలో చైర్‌పర్సన్‌పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు.

మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా.. అందులో 17 మంది కౌన్సి లర్లు చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా పండుగుల జయశ్రీరాజును చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. మెజా ర్టీ లేకపోవడంతో స్వప్నసమావేశానికి హాజరుకాలేదు. 

ఓటింగ్‌లో పాల్గొన్న కౌన్సిలర్లు..

గ్యారల శ్రీనివాస్‌గౌడ్, వడ్డెపల్లి విద్యావతి, పసుల రాజేందర్, పండుగుల జయశ్రీ, చల్లూరు మురళీధర్ రెడ్డి, జోర్క గీత, ఓరుగంటి సుజాత, చెవుల హరిశంకర్, సిద్దెంకి కృష్ణారెడ్డి, కందాడి అనుపమ, తొండపు రోహిణి, పాశం అర్చన, మండలి కోటేశ్వర్‌రావు, రమావత్ పరుశురాం, దండెం కృష్ణారెడ్డి, పబ్బతి లక్ష్మణ్, మద్ది నరేందర్‌రెడ్డి తదితరులు అవిశ్వాసానికి మద్దతు పలకడంతో పాటు చైర్‌పర్సన్‌గా పండుగుల జయశ్రీకి మద్దతు తెలిపారు.

చైర్‌పర్సన్ స్వప్నపై అవిశ్వాసం నెగ్గడంతో.. ప్రస్తుతం వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న చామల సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. పండుగల జయశ్రీను చైర్‌పర్సన్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు చామల సంపూర్ణ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు.