calender_icon.png 16 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌లో నెగ్గిన అవిశ్వాసం

19-07-2024 03:53:24 AM

  • కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్‌కు షాక్ 
  • బీఆర్‌ఎస్‌ేొబీజేపీ పొత్తుకు ఆదిలాబాద్‌లో బీజం! 
  • సంబురాలు జరుపుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు

ఆదిలాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంకు కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో రంజానీకి షాక్ తప్పలేదు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన జహీర్ రంజానీ ఇటీవల ఆయన బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్‌పై అవిశాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ మేరకు కలెక్టర్ రాజరిషా ఈ నెల 18న అవిశాస సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ఆర్డీవో వినోద్ కుమార్ నేతృతంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ హైమద్ ఆధర్యంలో మున్సిపల్ కార్యాలయంలో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 49 మంది వార్డ్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో మెంబర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి 50 మంది సభ్యులు సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా, 15 మంది గైర్హాజరయ్యారు. 34 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కలిపి 35 మంది సభ్యులు పాల్గొని సంతకాలు చేయడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో వెల్లడించారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్ల సంబురాలు

ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశాసం నెగ్గడంతో బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సంబురాలు జరుపుకొన్నారు. సమావేశం ఆనంతరం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వినాయక్ చౌక్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన వైస్ చైర్మన్ జహీర్ రంజాని ని గద్దె దించేందుకు చేపట్టిన అవిశాసంలో నెగ్గడం జరిగిందన్నారు. తరలోమైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటామని వెల్లడించారు.