calender_icon.png 16 March, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకురాలు

17-02-2025 12:00:00 AM

వెలుగులను మింగాలనుకున్న చీకటికి నిరాశే మిగిలింది

సూర్యుణ్ణి మింగానని విర్రవిగిందో లేదో

తన కడపునుండే పున్నమి వెలుగుల రూపేణా

పుడమిపై పుట్టేసరికి అవమాన భారంతో

ఉదయానికి ఆత్మహత్య చేసుకుంది

వసంతాన్ని చెరిచానని లోలోన 

ముసిముసిగా నవ్వుకుంటుంది శిశిరం

శిశిరపు నవ్వును సవాలు చేస్తూ 

విచ్చుకుంటుంది

అరుణారుణ మోదుగు పూల వనం

విప్లవం ప్రకృతి...

అంతాలు లేని అంకురాలు

నిరంతరం తమను తాను

పరిణామీకరించుకుంటూ ప్రయాణించడమే

వాటి అసలు రూపం...

వాటి నిర్మూలననే ఆలోచన

నిన్ను నీవే అంతమొందించుకునే

నీ ఆఖరి అమాయకత్వపు ప్రకటన.


- దిలీప్.వి

8464030808