మార్కెట్ ర్యాలీకి బ్రేక్
ముంబై, డిసెంబర్ 5: రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించకపోవడం, జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గించినందున నిరుత్సాహపడ్డ ఇన్వెస్టర్లు శుక్రవారం లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో వరుస ఐదు రోజుల మార్కెట్ ర్యాలీకి బ్రేక్‌పడింది. తీవ్ర ఒడిదుడుకులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 56 పాయింట్లు నష్టపోయి 81,709 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 24,677 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్‌లో అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ 2 శాతం వరకూ నష్టపోగా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకిలు 3 శాతం వరకూ పెరిగాయి.