ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్‌లో భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్- ట్రిసా జాలీ జంట 21-19, 17-21, 15-21తో పియర్లీ టాన్ర్త్‌క్షి (మలేషియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాదీ ద్వయం సుమిత్-సిక్కిరెడ్డి జోడీ కూడా 22-20, 19-21, 22-24తో కెవిన్ జాంగ్ (కెనడా) చేతిలో పరాజయం పాలై తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఇక మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు నేడు ప్రిక్వార్టర్స్‌లో చైనా స్టార్ హాన్‌ను ఎదుర్కోనుంది.