calender_icon.png 27 January, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాక్సింగ్‌లో నిరాశే

31-07-2024 01:34:43 AM

తొలి రౌండ్‌లోనే అమిత్, జాస్మిన్ ఓటమి

పారిస్: బాక్సింగ్ క్రీడలో మంగళవారం నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయి. పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగల్ రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరిగాడు. మంగళవారం జరిగిన పోటీలో చిన్ యెంబా (జాంబియా) చేతిలో 4 తేడాతో అమిత్ పరాజయం పాలయ్యాడు. దీంతో అమిత్ పోరాటం రెండో రౌండ్‌కే పరిమితమయ్యింది. మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్‌లో జాస్మిన్ 0 పిలిప్పీన్స్ బాక్సర్ పెటెకియో నెస్తీ చేతిలో పరాజయం చవిచూసింది. నిఖత్ జరీన్ శుభారంభం చేయగా.. నేడు టోక్యో పతక విజేత లవ్లీనా బరిలోకి దిగనుంది.