calender_icon.png 17 January, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అథ్లెటిక్స్‌లో నిరాశే

10-08-2024 04:03:51 AM

పారిస్: ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన 4x400 మీటర్ల రిలే రేసులో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషులు, మహిళల జట్లు హీట్స్‌లోనే వెనుదిరిగాయి. హీట్ రేసులో ముహమ్మద్ అనస్, అజ్మల్, అమోల్ జాకబ్, రాజేశ్‌లతో కూడిన పురుషుల బృందం 4x400 మీ రేసును 3 నిమిషాల 58 సెకన్లలో చేరుకొనిఏడో స్థానంలో.. ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచింది. మహిళల 4x400 రిలే రేసులో హీట్ విథ్యా రామ్‌రాజ్, దండి జ్యోతిక, పూవమ్మ, సుభాలతో కూడిన భారత బృందం (3 నిమిషాల 32.51 సెకన్లు) గమ్యాన్ని చేరి 8వ స్థానంలో.. ఓవరాల్‌గా 15వ స్థానంతో సరిపెట్టుకున్నారు.