బస్టాడ్ (స్వీడన్): గాయాల నుంచి కోలుకొని రెండేళ్ల తర్వాత ఓ మేజర్ టోర్నీ ఫైనల్‌కు చేరిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్‌కు తుదిపోరులో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన నోర్డియా ఓపెన్ ఫైనల్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాదల్ 3 2 ఏడో సీడ్ నునో బోర్గెస్ (పోర్చుగల్) చేతిలో పరాజయం పాలయ్యాడు. టోర్నీ ఆసాం తం సుదీర్ఘ పోరాటాలతో ఆకట్టుకున్న నాదల్.. గంటన్నర పాటు సాగిన ఫైనల్లో వరుస సెట్లలో ఓడాడు.