- పారిస్ ఒలింపిక్స్ బెర్త్ మిస్
అంటల్యా: ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత మహిళల ఆర్చరీ టీమ్‌కు నిరాశ ఎదురైంది. రికర్వ్ విభాగంలో బరిలోకి దిగిన దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత భక్త్తో కూడిన భారత త్రయం.. ప్రిక్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత్ 3 మనకంటే తక్కువ ర్యాంకర్ ఉక్రెయిన్చేతిలో ఓడింది. ఒక దశలో 3 ఆధిక్యంలో నిలిచిన మన అమ్మాయిలు.. ఆ తర్వాత ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చి వెనుకబడిపోయారు. సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా.. దీపిక కుమారి సారథ్యం లోని మన జట్టు ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటి బాట పట్టింది. ఇక పురుషుల విభాగంలో శనివారం భారత జట్టు బరిలోకి దిగనుంది.