పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ లో రేస్‌వాక్ క్రీడలో మన అథ్లెట్ల పోరాటం ముగిసింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత రేస్ వాకర్లు వికాస్ సింగ్, పరమ్‌జీత్ సింగ్, ప్రియాంక గోస్వామి నిరాశపరిచారు. గురువారం జరిగిన 20 కిమీ రేస్‌వాక్‌లో మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 41వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల 20 కిమీ రేస్‌వాక్‌లో వికాస్ సింగ్, పరమ్‌జీత్‌లు వరుసగా 30, 37వ స్థానాల్లో నిలిచారు. ఆసియా గేమ్స్‌లో రజతం గెలుచుకున్న ప్రియాంక గోస్వామి 20 కిమీ రేస్ వాక్‌ను గంటా 39 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేయగా.. పురుషుల విభాగంలో వికాస్ గంటా 22 నిమిషాల 36 సెకన్లలో.. పరమ్‌జీత్ గంటా 23 నిమిషాల 48 సెకన్లలో 20 కిమీ రేస్‌వాక్‌ను పూర్తి చేశారు.