calender_icon.png 15 January, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాశపర్చిన ఆర్బీఐ.. క్షీణించిన మార్కెట్

09-08-2024 02:06:00 AM

సెన్సెక్స్ 582 పాయింట్లు డౌన్

ముంబై, ఆగస్టు 8: మూడు రోజుల వరుస పతనానికి బుధవారం బ్రేక్ వేసిన మార్కెట్ మళ్లీ  క్షీణబాట పట్టింది. గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ రిజర్వ్‌బ్యాంక్ పాలసీ ప్రకటన వెలువడిన తర్వాత అదేపనిగా పడిపోయింది. వరుసగా తొమ్మిదోసారీ ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టడం, కఠిన పాలసీ వైఖరిని మార్చకపోవడంతో ఒక దశలో 669 పాయింట్ల నష్టంతో 78,798 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 582 పాయింట్లు కోల్పోయి 78,886 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 217 పాయింట్లు క్షీణించి  24,079 పాయింట్ల కనిష్ఠస్థాయికి తగ్గిన అనంతరం చివరకు 180 పాయింట్ల నష్టంతో 24,117 పాయింట్ల వద్ద నిలిచింది. క్యూ1కు ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని స్వల్పంగా పెంచడం, ఆర్థికాభివృద్ధి అంచనాల్ని కుదించడంతో దేశీయ మార్కెట్ తగ్గిందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.