calender_icon.png 21 January, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుమరుగవుతున్న నీటివనరులు

26-08-2024 02:52:07 AM

  1. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతూ 
  2. ఇక్కడా హైడ్రా చర్యలు చేపట్టాలి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 25(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు కనుమరుగవుతున్నాయి. కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని చెరువులు చిక్కిశల్య మవుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన నీటిపారుదలశాఖ, రెవెన్యూశాఖ అధికారులు కళ్లు మూసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. చెరువులే కాకుండ ప్రాజెక్టుల శిఖం భూమును సైతం కబ్జా చేస్తున్నా రు. ఇటీవల అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడడానికి కబ్జాయే ప్రధాన కారణమని తేలి ంది.

జిల్లా వ్యాప్తంగా 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చె రువులు 167 ఉన్నాయి. వాటికింద సుమా రు 72,032 ఎకరాల భూమి సాగవుతోంది. 100 ఎకరాలకు పై గా ఆయకట్టు ఉన్న చెరువులు సుమారు 2వేల వరకు ఉన్నాయి. వాటికింది సుమా రు 60 వేల ఎకరాల వరకు సాగు జరుగుతోంది. వీటిల్లో సుమారు 70 శాతం వరకు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలుస్తోంది. కొన్ని చెరువులు అయితే కనుమరు గు అయ్యాయి. గతంలో ఇక్కడ  ఫలానా చె రువు ఉండేదట అనే చె ప్పుకొనే పరిస్థితి నెలకొంది.

ఇక్కడా హైడ్రాను అమలు చేయాలె..

హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన హై డ్రాను జిల్లాలోనూ అమలు చేస్తే తప్ప కబ్జా ల భాగోతం వెలుగులోకి రాదని ప్రజలు అ భిప్రాయపడుతున్నారు. పాల్వంచలోని మే డికుంట చెరువు, ఎర్రచెరువు, భూపతిరావు చెరువు, చింతచెరువు, రాతిచెరువు కబ్జాలకు  గురవుతున్నాయి. చుంచుపల్లి మండలంలో ని బాబు క్యాంపులో ఉండే చెరువులో పెద్దపెద్ద భవంతులు వెలుస్తున్నాయి. ఇక్కడ చె రువు ఆనవాలు కన్పించడంలేదు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలో ఇంచుమించు ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో కోట్ల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి పో తున్నాయి. అధికారుల అండదండలతో భేషరతుగా భూ దందా సాగుతోంది.

పాతపాల్వంచలో నిచింతలచెరువు సర్వే నెం 70 లో 94.33 ఎకరాల భూమి ఉండాలి. కానీ నేడు 40 ఎకరాలు కూడా లేదు. పాల్వంచ పరిధిలోని  సర్వే నెం 403లో 30.25 ఎకరాల వి స్తీర్ణంలో గల ఎర్రగుంట చెరువును ఏకంగా నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ ఆక్ర మించిందనే ఆరోపణలున్నాయి. మేడికుం ట చెరువు 10ఎకరాల విస్తీర్ణం ఉండగా ప్రస్తుతం కేవలం 3 ఎకరాలకు పరిమితమైం ది. రాతిచెరువు విస్తీర్ణం 35 ఎకరాలు కాగా ప్రసుత్తం సగాని కి పైగా కబ్జాకు గురైంది. చెరువు శిఖం భూముల కబ్జా చేసి రియల్‌ఎస్టేట్ వ్యాపారలు తప్పుడు డ్యాక్యుమెంట్ల తో కొత్తగూడెం  సబ్‌రిజిస్టార్ కార్యాలయం లో రిజిస్ట్రేషన్ చేయించి   లక్షలు దండు కొంటున్నారు. 

 ఉదాసీనంగా అధికారులు..

నీటిపారుదలశాఖ, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారులు చెరువుల రక్షణపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లు వస్తున్నాయి. చెరువుల కింద సాగు భూ ములు ఇళ్ల స్థలాలుగా మారతుంటే చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకొని విలవిలలాడు తున్నాయి. మేడికుంట చెరువుకు ఆయకట్టు లేకపోవడంతో ఆ ప్రాంతంలో   పార్కును నిర్మించేందుకు ఆప్పటి ఎమ్మెల్యే జలగం వె ంకట్రావు చర్యలు చేపట్టినా అది కార్యరూప ం దాల్చలేదు. చింతచెరువు కబ్జాదారులకు నోటీసులు జారీ చేశారు. ఆతర్వాత ఏమి జరిగిందో నోటీసులు బుట్టదాఖలయ్యాయి.

ఆక్రమణలు వాస్తవమే..

చెరువుల కబ్జాపై నీటిపారుదల శాఖ ఈ ఈ అర్జున్‌ను వివరణ కోరగా గతంలో ఆక్రమణలు జరిగినమాట వాస్తవమేనని అన్నా రు. ప్రస్తుతం ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. 2 0 సంవత్సరాల క్రితం ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లడం లేదన్నారు. ఎవరైనా కొత్తగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే తొలగిస్తున్నామన్నారు.