calender_icon.png 11 February, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుమరుగవుతున్న గిరిజన సహకార సంస్థ సేవలు

11-02-2025 12:41:10 AM

  • నష్టపోతున్న గిరిజనులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే 
  • కార్యాలయం సిబ్బంది లేక ఇబ్బంది

కామారెడ్డి(విజయ క్రాంతి), గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన గిరిజన సహకార సంస్థ రోజు రోజుకు తన కార్యకలాపాలు కనుమరుగవు తున్నాయి. గిరిజన సహకార సంస్థ ఆధ్వ ర్యంలో అటవీ ఉత్పత్తులను సేకరించి కొనుగోలు చేసే వారు. గిరిజనులు  అడవులలో సేకరించిన తేనెతోపాటు కుంకుడు కాయలు చింతకా యలు బంక గొందు ఇతర  అటవీ ఉత్ప త్తులు కొనుగోలు చేసి వాటిని గిరిజన తం డాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పంపిణీ చేసే వారు.

మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం గిరిజన సహ కార సంస్థలో సిబ్బంది కొరత వెక్కిరిస్తుంది. ఉన్నవారు రిటర్మెంట్ అవుతున్నారు తప్ప కొత్తవారు రావడం లేదు. దీంతో ఖాళీలు ఏర్పడి పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం కూడా గిరిజన సహకార సంస్థలు పట్టించుకోవడం లేదు. గతంలో ఉన్న ప్రభు త్వం నిధులను కేటాయించకపోవ డంతో  గిరిజన సహకార సంస్థ కార్యకలా పాలు రోజురోజుకు సన్న గిల్లుతున్నాయి. ప్రస్తుతం కేవలం గిరిజన వసతిగృహాలకు సరుకులను పంపిణీ చేస్తున్నారు.

అటవీ ఉత్పత్తుల సేకరణ ఆటకెక్కింది. గిరిజన సహకార సంస్థ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిం చకపోవడంతో కార్యకలపాలు సన్నగిల్లు తున్నాయి. ఎంతో లక్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ గిరిజనుల మేలు కోసం కృషి చేయాల్సిన సంస్థలో సిబ్బంది కొరత నిధుల కొరత తో కునా రిల్లుతుంది.