calender_icon.png 16 January, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి అదృశ్యం

08-08-2024 03:09:30 AM

ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు

ఘట్‌కేసర్, ఆగస్టు 7: ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం..  ఎదులాబాద్‌లోని  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దామర వినయ్ కుమార్(16) జూన్ 27న ఎంఎల్‌టీ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ పొందాడు. అయితే అతడికి చదువుపై ఆసక్తి లేకపోవటంతో యాజమాన్యానికి చెప్పకుం డా జూలై 19న ఇంటికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు.. వినయ్ కుమార్‌కు నచ్చజెప్పి తిరిగి ఈనెల 6న కళాశాలలో చేర్పించి వెళ్లారు. అయితే అదేరోజు సాయంత్రం కళాశాలలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయిన వినయ్ కుమార్ తిరిగి రాలేదు. దీంతో  ప్రిన్సిపాల్ వేణుగోపాల్ బుధవారం ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.