నల్లగొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): భర్తతో గొడవపడిన భార్య తన కూతురును తీసుకును ఇంటి నుంచి వెళ్లిపోయింది. నల్లగొం డ పట్టణంలోని హైదర్‌ఖాన్‌గూడలో కత్తుల ప్రసాద్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి తొమ్మి దేండ్ల కూతురు ఉంది. కొంతకా లంగా కుటుంబ పరమైన విషయం లో దంపతుల మధ్య గొడవలు జరు గుతున్నాయి. ఈ నెల 5న రాత్రి భార్యాభర్తల గొడవ పడటంతో సుధ తన కుమార్తె నవ్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తెలిసిన వారు, బంధువుల ఇండ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. సుధా అత్త ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌రెడ్డి తెలిపారు.