మహేశ్వరం, జూలై 3 (విజయక్రాం తి): వివాహిత అదృశ్యమైన సంఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీ షరీఫ్‌కు చెందిన డ్రైవర్ షేక్ ఫహీమ్‌తో ముంబైకి చెందిన అల్ఫియాకి ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. మొదట్లో కాపురం సజావుగానే సాగినప్పటికీ ఇటీవల భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పని నిమిత్తం బయటకు వెళ్లిన ఫహీమ్ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య అల్ఫియా (21) కనిపించలేదు. చుట్టుపక్కల బస్తీలో, తెలిసిన వారి వద్ద ఆచూకీ కోసం ఆరాతీసినా వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు ఫహీమ్ బుధవారం పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.