18-04-2025 12:53:55 AM
జహీరాబాద్, ఏప్రిల్ 17 :జహీరాబాద్ మండల పరిధిలోని జాడి మల్కాపూర్ గ్రామానికి చెందిన బల్లెపు సంగయ్య (34) తిరుపతి వెళ్లి వస్తానని తిరిగి ఇంటికి రాలేదని జహీరాబాద్ రూరల్ ఎస్త్స్ర ప్రసాద్ రావు తెలిపారు. ఈనెల 1న తిరుపతి వెళ్లి వస్తానని చెప్పి జహీరాబాద్ నుండి వికారాబాద్ రైలులో వెళ్లి అక్కడి నుండి తిరుపతికి రైలులో వెళ్తానని చెప్పి వెళ్లినట్లు భార్య స్వప్న తెలిపిందన్నారు.
తిరుపతి వెళ్లి తిరిగి రాకపోయేసరికి బంధువుల వద్ద స్నేహితుల వద్ద వెతికినప్పటికీ జాడ తెలియక పోవడంతో భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు ఈయన ఆచూకీ తెలిసినవారు జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.