calender_icon.png 6 February, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగ్నల్ జంపింగ్‌లతో అనర్థాలు

01-02-2025 12:00:00 AM

మన దేశంలోని అనేక నగరాలలో ట్రాఫిక్ లైట్లు ఉంటాయి కానీ, కొందరు వాహనదారులు పట్టించుకోరు. అక్కడ ట్రాఫిక్ పోలీసులూ ఉండరు. ట్రాఫిక్ లైట్లు వట్టి అలంకారానికే పరిమితమవుతున్నాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో పెరుగుతున్న రద్దీల మధ్య వాహనాలు, పాదచారుల సానుకూల కదలికను నిర్ధారించేవి ట్రాఫిక్ లైట్లు మాత్రమే.

చాలామంది చదువుకున్న వారుసైతం వీటిని గుర్తించక పోవడం బాధాకరం. దీనిని ఒక బాధ్యతవలె కాక సూచనలుగానే పరిగణిస్తారు. సిగ్నల్స్ చట్టాన్ని ఉల్లంఘించడం అంటే ట్రాఫిక్ ప్రవాహానికి అంతరాయం కలిగించినట్లే లెక్క. ఇది కొందరి జీవితాలను ప్రమాదంలో పడేసే వైఖరి. ఎరుపు లేదా పసుపు లైట్లను దాదాపు పూర్తిగా విస్మరించడం సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది.

ఈ నిర్లక్ష్యపు డ్రైవర్ల కారణంగా కూడళ్లవద్ద తీవ్ర ప్రమాదాలకూ అప్పుడప్పుడు ఆస్కారం ఏర్పడుతుంది. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్స్‌కూ దారితీస్తుంది. పోలీసు అధికారులు ఈ విషయంపై ప్రజలలో అవగాహన కోసం ‘పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్లు’ నిర్వహించాలి. కెమెరాలు, ఆటోమేటెడ్ ఫైన్ సిస్టమ్స్‌ను పటిష్ట పరచాలి. అధునాతన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాలను అన్ని నగరాలలో ప్రవేశపెట్టాలి.

ట్రాఫిక్ సిగ్నల్స్‌కు కట్టుబడి ఉండటం అన్నది కేవలం చట్టపరమైన నిబంధనే కాదు, సామాజిక బాధ్యత కూడా. వాహనదారులు, సైక్లిస్టులు, పాదచారులు రోడ్డు భద్రతను ప్రోత్సహించడానికి సమిష్టిగా పని చేయాలి. ట్రాఫిక్ లైట్లను గౌరవించడం క్రమశిక్షణను పెంపొందిస్తుంది. చట్టాన్ని పాటించడమంటే దేశభక్తిని కలిగి ఉండడంగా భావించాలి. 

 గడీల ఛత్రపతి, హైదరాబాద్