calender_icon.png 20 March, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగ విద్యార్థులు సహాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి

20-03-2025 02:08:40 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 19(విజయ క్రాంతి): దివ్యాంగ విద్యార్థులు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అలింకో స్వచ్ఛంద సంస్థ వారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు కొరకు సర్వే నిర్వహించడం జరిగిందని, ఈ సర్వేలో 136 మంది విద్యార్థులను గుర్తించి వారికి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు ఇతర ఉపకరణాలను అందించేందుకు అలింకో సంస్థ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

అంగవైకల్యం కలిగిన వారు తమ పనులను తామే స్వయంగా చేసుకోవడానికి ఈ సహాయ ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.  అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఇతర సహాయ ఉపకరణాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో అలింకో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గౌరవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.